రూ.19,999 లకే డిటెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర & ఇతర వివరాలు
481 просмотров
18.08.2020
00:02:14
Описание
భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీలో పేరుగాంచిన డిటెల్, తాజాగా డిటెల్ ఈజీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధర కేవలం రూ.19,999 (ప్లస్ జీఎస్టీ). డిటెల్ ఈజీ ఈ-స్కూటర్‌ను ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లో ప్రవేశపెట్టారు. డిటెల్ ఈజీ జెట్ బ్లాక్, పెరల్ వైట్ మరియు మెటాలిక్ రెడ్ అనే మూడు రంగులో లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న వాటిలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.
Комментарии