Shakalaka Shankar Shocking Comments On Trivikram Srinivas, Dil Raju
Описание
Shakalaka shankar Shocking Comments on Trivikram Srinivas, Dil Raju. Shambho Shankara movie will release on 29th June జబర్దస్త్ లో కమెడియన్ గా పాపులర్ అయిన షకలక శంకర్ ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నాడు. కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో శంకర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం శంభో శంకర. జూన్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని జోరుగా నిర్వహిస్తోంది. మీడియా సమావేశంలో షకలక శంకర్ మాట్లాడుతూ త్రివిక్రమ్, అల్లు శిరీష్, దిల్ రాజు, రవితేజ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శంభో శంకర కథ తీసుకుని త్రివిక్రమ్ వద్దకు వెళ్లాలని శంకర్ తెలిపాడు. అప్పటికి తాను త్రివిక్రమ్ అ.. ఆ చిత్రంలో చిన్న పాత్రలో నటించానని శంకర్ తెలిపాడు. తనవద్ద ఓ కథ ఉందని హీరోగా నటిస్తున్నాని చెబితే.. నువ్వు హీరోనా అని త్రివిక్రమ్ ఆశ్చర్యంగా అడిగారు. కథ తీసుకుని దిల్ రాజు గారి దగ్గరకు వెళ్ళా. ఆయన చేయి నొప్పి కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన వద్దకు వెళితే తరువాత చిత్రంలో వేషం ఇస్తానని అన్నారు. తాను అందుకు రాలేదు అని ఓ చిత్రంలో హీరోగా నటించబోతున్నా.. దానికి డబ్బు పెట్టాలని కోరా. ఇప్పుడు చాలా చిత్రాలు చేస్తున్నా.. తరువాత చేద్దాంలే అని దిల్ రాజు అన్నట్లు శంకర్ తెలిపాడు.
Комментарии