సాక్ష్యం ఫస్ట్ లుక్ : పూజా హెగ్డేతో డీప్ రొమాన్స్

517 просмотров 14.02.2018 00:01:27

Описание

Pooja Hegde, Bellamkonda Srinivas' Saakshyam First Look Teaser out. Produced by Abhishek Nama and Written & Directed by Sriwass బెల్లం కొండ శ్రీనివాస్, క్రేజీ హీరొయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'సాక్ష్యం'. డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సాయిశ్రీనివాస్ వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నా సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు సమంత, రకుల్, ప్రగ్య జైస్వాల్ వంటి క్రేజీ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. పూజా హెగ్డే అయినా ఈ హీరో ఫేట్ మారుస్తుందేమో చూడాలి. వాలంటైన్స్ డే సందర్భంగా సాక్ష్యం ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో దర్సకుడు శ్రీనివాస్, పూజ హెగ్డే ఇద్దరిని ఆవిష్కరించాడు. ఘాటు కౌగిలింతతో కనిపిస్తున్నా వీరిద్దరూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ లోతైన రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ వారసుడిగా శ్రీనివాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరుసగా శ్రీనివాస్ భారీ చిత్రాలు చేస్తున్నాడు. కానీ విజయం మాత్రం దక్కలేదు. ఈ చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ యువ హీరో ఆరాటపడుతున్నాడు. బెల్లం కొండ శ్రీనివాస్.. వివి వినాయక్, బోయపాటి శ్రీను వంటి స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేసాడు. వినాయక్ తో అల్లుడు శీను, బోయపాటి తో జయజనకి నాయక చిత్రాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు పర్వాలేదనిపించాయి కానీ మంచి విజయాన్ని మాత్రం దక్కించుకోలేక పోయాయి.

Комментарии

Теги: