బాలీవుడ్ గ్లామర్ సెన్సేషన్ ! | Filmibeat Telugu

4 просмотров 15.12.2017 00:01:19

Описание

Janhvi Kapoor makes Instagram account public after Dhadak launch. Dhadak is an upcoming romantic drama film based on 2016 Marathi language film, Sairat. హీరోయిన్ శ్రీదేవి ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమను తన అందంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో శ్రీదేవి అప్పట్లో తిరుగులేదు. అటు అందం పరంగా, ఇటు అభినయం పరంగా ఆమె ఓ సెన్సేషన్. ఇపుడు శ్రీదేవి వారసత్వంలో ఆమె కూతురు జాహ్నవి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. 'ధడక్' అనే సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమా ‘ధడక్' లాంచ్ అయ్యే వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ ప్రొఫైల్ మెయింటేన్ చేసిన జాహ్నవి కపూర్.... ఇపుడు తన ప్రొఫైల్ పబ్లిక్ గా మార్చేసింది. అందులో తన హాట్ ఫోటోలతో పాటు చిన్ననాటి ఫోటోలు పోస్టూ అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫోటో చూసిన పలువురు సినీ అభిమానులు జాహ్నవి భవిష్యత్తులో బాలీవుడ్లో అందాల సెన్సేషన్ కావడం ఖాయం అంటున్నారు. తల్లి నుండి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న జాహ్నవి కపూర్.... వివిధ హావభావాలు ప్రదర్శిస్తూ ఓ ఫోటోను పోస్టు చేశారు. కేవలం అందం పరంగానే కాదు, నటన పరంగా కూడా తల్లి పేరు నిలబెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Комментарии

Теги:
బాలీవుడ్, గ్లామర్, సెన్సేషన్, Filmibeat, Telugu