Pawan Kalyan Met Ferry Boat Mishap Victims Families | Oneindia Telugu

2,797 просмотров 09.12.2017 00:02:05

Описание

Janasena Chief, Actor Pawan Kalyan meet Ferry Ghat Victims Family members here in Ongloe on Saturday. జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలులో ఫెర్రీఘాట్ పడవ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన వారికి అండగా ఉంటుందని అన్నారు. విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద గత నెలలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృతులకు సంతాపం తెలిపిన ఆయన తరువాత స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలుకు వచ్చారు.

Комментарии

Теги:
Pawan, Kalyan, Ferry, Boat, Mishap, Victims, Families, Oneindia, Telugu